Coast Guard DG: కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ కన్నుమూత
ఆగస్టు 18వ తేది జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
రాకేశ్ పాల్‌కు గుండెపోటు రావడంతో చెన్నై లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో మృతిచెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు సుదీర్ఘ సముద్ర అనుభవాన్ని కలిగి ఉన్నాడు.
అలాగే రాకేశ్ పాల్.. సమర్త్, విజిత్, సుచేత కృప్లానీ, అహల్యాబాయి, సీ-03 అనే అన్ని రకాల ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలకు నాయకత్వం వహించాడు. సముద్ర రక్షణ రంగంలో కీలక భూమిక పోషించారు. అనేక మంది కోస్ట్ గార్డ్ సిబ్బంది నియామకాలు కూడా చేపట్టారు.
Ram Narain Agarwal: ‘అగ్ని’ తొలి డైరెక్టర్ రామ్ నారాయణ్ కన్నుమూత
Tags
- Coast Guard DG Rakesh Pal
- Coast Guard Director General
- Indian Coast Guard
- Rakesh Pal
- Coast Guard
- Rajiv Gandhi General Hospital
- Heart Attack
- Sakshi Education News
- Director General Rakesh Pal
- Indian Coast Guard
- Rakesh Pal heart attack
- Rajnath Singh ICG program
- Rajiv Gandhi Government Hospital Chennai
- Rakesh Pal death news