Indian-Americans: మరో భారతీయురాలికి అమెరికాలో కీలక పదవి
Sakshi Education
భారతీయ మూలాలున్న అంజలి చతుర్వేదికి అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుంది. అమెరికా మాజీ సైనికుల సంక్షేమ బాధ్యతలు చూసుకునే ప్రభుత్వ విభాగ కీలక పదవికి అంజలిని నామినేట్ చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈమెను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ జనరల్ కౌన్సిల్‌గా బైడెన్ నామినేట్ చేశారు. ప్రస్తుతం ఈమె అమెరికా న్యాయశాఖలో నేర విభాగానికి డెప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వృత్తిరీత్యా లాయర్ అయిన ఈమె చాన్నాళ్ల క్రితం అమెరికా ప్రభుత్వం తరఫున న్యాయస్థానాల్లో వాదించారు. అంజలి తదనంతరం బ్రిటిష్ పెట్రోలియం వంటి దిగ్గజ ప్రైవేట్ సంస్థల తరఫున పనిచేశారు.
Also read: BRICS: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం - బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ తీర్మానం
Published date : 24 Jun 2022 05:49PM