PM Modi : అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి అగ్రస్థానంలో మోదీ..
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 69 శాతం ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా..మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు.
Hyperloop Tube : మద్రాస్ ఐఐటీ విద్యార్థులు నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్
25మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫుమియొ కిషిద చివరి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 39 శాతం జనామోదం లభించింది. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
Published date : 14 Aug 2024 12:04PM