Skip to main content

General Anil Chauhan: నూతన సీడీఎస్‌గా అనిల్‌చౌహాన్‌

Gen Anil Chauhan has been appointed as the new CDS

హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్‌ ్స స్టాఫ్‌(సీడీఎస్‌) పదవిని కేంద్రం భర్తీ చేసింది. నూతన సీడీఎస్‌గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌చౌహాన్‌ ని నియమించింది. బిపిన్‌ రావత్‌ మరణం తర్వాత ఈ సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. తదుపరి సీడీఎస్‌గా అనిల్‌చౌహాన్‌ ను ఎంపిక చేసింది. దీంతో దేశ రెండో సీడీఎస్‌గా చౌహాన్‌ నియమితులయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌహాన్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్‌లో అనిల్‌ చౌహాన్‌ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలను నిరోధించడంలో ఆయనకు అపార అనుభవం ఉంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:27PM

Photo Stories