Skip to main content

First Female Chief Election Commissioner: ఎవరీ వి.ఎస్‌.రమాదేవి? ఏకైక  మహిళా సీఈసీగా రికార్డ్‌,16 రోజులే పదవిలో కొనసాగినా..

First Female Chief Election Commissioner

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్‌.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్‌ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు.

ఏకైక  మహిళా సీఈసీగా రికార్డ్‌
కేంద్ర న్యాయ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా, లా కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్‌ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు.

16 రోజుల అనంతరం డిసెంబర్‌ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక  మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్‌ కూడా రికార్డు
నెలకొల్పారు.


► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు.
► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్‌ సేన్‌ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు.  

Published date : 19 Apr 2024 01:18PM

Photo Stories