డీఆర్‌డీవో బ్రహ్మోస్ డీజీగా అతుల్ దినకరా
Sakshi Education
డీఆర్‌డీవో బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రముఖ శాస్త్రవేత్త అతుల్ దినకరా రాణే నియమితులయ్యారు.
ఆయన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీగా, సీఈవోగా కూడా వ్యవహరిస్తారు. డీఆర్‌డీవోలోని డీఆర్‌డీఎల్‌లో సిస్టమ్ మేనేజర్‌గా 1987లో ఉద్యోగంలో చేరిన రాణే.. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థ అభివృద్ధిలో ప్రముఖపాత్ర పోషించారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ఆన్‌బోర్డ్ కంప్యూటర్ డివిజన్ ద్వారా అగ్ని–1 మిస్సైల్ కోసం ఆన్‌బోర్డ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ స్థాపించిన నాటి నుంచి కోర్ టీం సభ్యుడిగా ఉన్నారు.
Published date : 21 Dec 2021 06:51PM