Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మలివాల్‌కు.. నడిరోడ్డుపై వేధింపులు!
కంఝావాలాలో యువతిని కొందరు కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి మరణానికి కారణమైన ఉదంతం నేపథ్యంలో రాత్రిళ్లు బస్టాండ్‌ల వంటి చోట్ల మహిళలకు కనీస భద్రతపై తనిఖీ కోసం స్వాతి మలివాల్ తన బృందంతో కలిసి జనవరి 19వ తేదీ తెల్లవారుజామున ఎయిమ్స్ ప్రాంతంలో పర్యటించారు. ఎదురు బస్టాప్‌లో ఉన్న వారితో మాట్లాడుతుండగా తప్పతాగిన 47 ఏళ్ల హరీశ్ చంద్ర తన కారులో అక్కడికొచ్చి స్వాతిని కారులో కూర్చోవాలని బలవంతపెట్టాడు. బూతులు తిడుతూ కారులో కూర్చోవాలని తప్పుడు సంజ్ఞలు చేశాడు.
Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
కోపంతో అతడిని పట్టుకోబోగా కార్ డోర్‌కు, అద్దానికి మధ్య స్వాతి చేయి ఇరుక్కుంది. కారులో పారిపోతూ స్వాతిని అలాగే కొన్ని మీటర్ల దూరం ముందుకు ఈడ్చుకెళ్లాడు. అదృష్టవశాత్తు ఆమె ఎలాగోలా చేతిని విడిపించుకోగలిగింది. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన పోలీసులకు స్వాతి విషయం చెప్పడంతో వెంటనే కారు జాడ కనుక్కొని నిందితుడు హరీశ్‌ను అరెస్ట్‌చేశారు. ‘సాక్షాత్తు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే ఇలా జరిగితే దేశ రాజధానిలో ఎంతటి దారుణ పరిస్థితి ఉందో ఊహించుకోవచ్చు’ అని తనకు జరిగిన అవమానకర ఘటనపై స్వాతి హిందీలో ట్వీట్‌చేశారు.