Skip to main content

MP Balu Dhanorkar: కాంగ్రెస్‌ ఎంపీ బాలు ధనోర్కర్‌ హఠాన్మరణం

మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన ఏకైక లోక్‌సభ సభ్యుడు సురేశ్‌ అలియాస్‌ బాలు ధనోర్కర్‌(47) హఠాన్మరణం చెందారు.
MP Balu Dhanorkar

గుర్‌గ్రామ్‌లోని ఆస్పత్రిలో మే 30న ఆయన తుదిశ్వాస విడిచారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఈ నెల 26న ధనోర్కర్‌కు కిడ్నీ స్టోన్స్‌ ఆపరేషన్‌ జరిగింది. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మే 28న‌ విమానంలో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లారని కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ తొరాట్‌ చెప్పారు. అక్కడే పరిస్థితి విషమించి చనిపోయినట్లు తెలిపారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ధనోర్కర్‌ తండ్రి నారాయణ్‌ ధనోర్కర్‌(80) మే 27న‌ సాయంత్రం కన్నుమూశారు. 

Singer Tina Turner: ప్రముఖ సింగర్ 'క్వీన్ ఆఫ్ రాక్ ఎన్ రోల్' టీనా టర్నర్ కన్నుమూత

మే 28న‌ జరిగిన తండ్రి అంత్యక్రియలకు బాలు ధనోర్కర్‌ రాలేకపోయారు. కాగా, ధనోర్కర్‌కు భార్య ప్రతిభ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. శివసేన ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన ధనోర్కర్‌ 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2019లో శివసేనను వీడి లోక్‌సభ ఎన్నికల్లో చంద్రాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ సీనియర్‌ నేత హన్స్‌రాజ్‌ అహిర్‌పై గెలుపొందారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందిన ఏకైక ఎంపీగా ధనోర్కర్‌ నిలిచారు. ఆయన భార్య ప్రతిభ వరోరా–భద్రావతి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలు ధనోర్కర్‌ అకాల మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సంతాపం ప్రకటించారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (30 ఏప్రిల్ - 06 మే 2023)

Published date : 31 May 2023 08:33PM

Photo Stories