Guinness Record: మహిళల పొత్తికడుపు ప్లాంక్స్‌లో గిన్నిస్ రికార్డు!!
కెనడాలోని అల్బెర్టాకు చెందిన డోనాజీన్ వైల్డ్ అనే 62 ఏళ్ల బామ్మ, ఏకంగా 4.5 గంటల పాటు పొత్తికడుపు ప్లాంక్స్ చేసి, మహిళల విభాగంలో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డును సృష్టించింది. 2019లో 4 గంటల 40 నిమిషాల పాటు ప్లాంక్స్ చేసి రికార్డు నెలకొల్పిన డానా గ్లోవాకా రికార్డును డోనాజీన్ అధిగమించింది.
గతంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డోనాజీన్ ఈ ఘనతను సాధించడం విశేషం. స్కూలు విద్యార్థులు, తన 12 మంది మనవళ్ల కేరింతల మధ్య ఈ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ టీనా షి రికార్డును పరిశీలించారు.
చాలా కష్టంగా గడిచిన సమయం..
మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయని, కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టంగా గడిచాయని, చివరి గంటలో చుక్కలు కనిపించాయంటూ డోనాజీన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. పదేళ్ల కఠిన ప్రాక్టీస్ తరువాత వరల్డ్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందన్నారు.
Miss Universe: అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్న సౌదీ సుందరి
దీర్ఘకాలిక నొప్పి నుంచి విముక్తి..
విశేషం ఏమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి, తిమ్మిరితో బాధపడేవారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రతీరోజూ ప్లాంక్స్ చేయడం మొదలు పెట్టారట. డోనాజీన్ ప్రతిరోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేదని, ఈ రికార్డులో భాగంగా దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు ఆమె భర్త రాండీ.