Indian American Raja J Chari: యూఎస్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా చారి
Sakshi Education
భారతీయ అమెరికన్ రాజా జె చారి పేరును ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు యూఎస్ రక్షణ శాఖ ప్రకటించింది. దీనికి సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంది. 45 ఏళ్ల చారి ప్రస్తుతం నాసాలో క్రూ–3 కమాండర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజా జై హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చారి మసాచుసెట్స్ వర్సిటీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు.
Published date : 06 Feb 2023 05:38PM