First Indian American: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
Sakshi Education
అమెరికాలోని మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ గా డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు అరుణా మిల్లర్(58) చరిత్ర సృష్టించారు.
Aruna Miller as Lieutenant Governor of Maryland
మేరీల్యాండ్ హౌస్ మాజీ డెలిగేట్ అయిన ఆమె మేరీల్యాండ్ 10వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాలోని రాష్ట్రాల్లో గవర్నర్ తర్వాత అత్యున్నత పదవి లెఫ్టినెంట్ గవర్నర్. అరుణకు ఏడాది వయసు ఉన్నప్పుడు వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లింది.