Andhra Pradesh : నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నవంబర్ 29వ తేదీన (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
Published date : 29 Nov 2022 05:39PM