Skip to main content

25th Chief of the Naval Staff: భారత నావికాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?

Admiral R Hari Kumar

భారత నావికాదళ 25వ అధిపతి(చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాప్‌)గా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ బాధ్యతలు చేపట్టారు. నవంబర్‌ 30న న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నుంచి హరికుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేరళ రాష్ట్రం నుంచి నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. కేరళలోని తిరువనంతపురంలో 1962, ఏప్రిల్‌ 12న జన్మించిన రాధాకృష్ణన్‌ హరికుమార్‌(ఆర్‌.హరికుమార్‌) 1983లో ఎన్‌డీఏలో శిక్షణ పూర్తి చేసుకొన్నారు. ఇప్పటివరకు(నేవీ చీఫ్‌ కాకముందు) వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌గా ఉన్నారు. కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్‌ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది.
చ‌ద‌వండి: స్వీడన్‌ ప్రధానిగా ఎన్నికైన మహిళా నేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత నావికాదళ 25వ అధిపతి(చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాప్‌)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్‌ 30
ఎవరు    : వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ 
ఎందుకు : ఇప్పటివరకు నేవీ అధిపతిగా ఉన్న అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Nov 2021 06:00PM

Photo Stories