Skip to main content

Domestic Work: మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజుకి 7.2 గంటల ఇంటి పనిలోనే..

మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది.

జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటి పనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. 
అధ్యయనం ఏం చెప్పిందంటే..  
ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్‌ యూజ్‌ డేటా : ఏ టూల్‌ ఫర్‌ జెండర్డ్‌ పాలిసీ అనాలిసిస్‌’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే, మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్‌ నమ్రత చందార్కర్‌ తెలిపారు.

Railway: నిమిషానికి 2.25 లక్షల టికెట్లు అందించ‌నున్న‌ రైల్వే

Published date : 13 Feb 2023 02:00PM

Photo Stories