Muziris: దేశంలో తొలి వాటర్ మెట్రోను ఎక్కడ ప్రారంభించారు?
దేశంలో తొలి వాటర్ మెట్రో(బ్యాటరీతో నడిచే బోటు) కేరళ రాష్ట్రం కొచ్చిలో ప్రారంభమైంది. వాటర్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా డిసెంబర్ 31న కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్‌ఎల్) ఈ బోటును ప్రారంభించింది. బ్యాటరీతో నడిచే బోటును కేఎంఆర్‌ఎల్‌కు కొచ్చి షిప్‌యార్డు అప్పగించింది. వందమందితో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బోటు 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగు అవుతుంది. గంటకు 10 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ వ్యవస్థతో ప్రయాణ సమయంలో ప్రకృతి అందాలను వీక్షించేలా దీన్ని రూపొందించారు. బోటు ఛార్జింగు అయిపోతే దానంతటదే డీజిల్ ఆప్షన్‌కు మారిపోతుంది. ప్రపంచంలోనే విద్యుత్తు బ్యాటరీతో నడిచే అతిపెద్ద బోటు కూడా ఇదే.
ముజిరిస్ పేరుతో..
ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యాలకు చేరుకునేందుకు రూ.747 కోట్ల చేపట్టిన వాటర్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా మొత్తం 23 విద్యుత్ బోట్లను ఇపుడు కొచ్చి షిప్‌యార్డ్ రూపొందిస్తోంది. తాజాగా ప్రారంభించిన మొట్టమొదటి బోటుకు ముజిరిస్ అని పేరు పెట్టారు. 76 కి.మీ.ల పొడవుతో, 38 టెర్మినళ్లను కలుపుతూ ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
చదవండి: 2021లో దేశవ్యాప్తంగా మరణించిన పులుల సంఖ్య?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి వాటర్ మెట్రో(బ్యాటరీతో నడిచే బోటు)ను ఎక్కడ ప్రారంభించారు?
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ త్రిపాఠి
ఎక్కడ : కొచ్చి, కేరళ
ఎందుకు : ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యాలకు చేరుకునేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్