Venkaiah Naidu: వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ఏ నది ఒడ్డున ప్రారంభించారు?
అస్సాంలోని గువాహటిలో బహ్మ్రపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రం ప్రారంభమైంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్ అక్టోబర్ 3న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నగరంలోని ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్య ‘ఫరెవర్ గువాహటి’ సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) విడుదల చేశారు. అస్సాం రాష్ట్ర కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీఈటీ–ఎంఆర్‌ఐ యంత్రాన్ని ప్రారంభించారు. అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్ కేన్సర్ కేర్ మోడల్‌ను ఆయన అభినందించారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు.
లీగల్ అవేర్‌నెస్, అవుట్‌రీచ్ క్యాంపెయిన్ ప్రారంభం
జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్‌నెస్, అవుట్‌రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్‌నా«థ్ కోవింద్ అక్టోబర్ 2న ఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పాల్గొన్నారు.
చదవండి: అతిపెద్ద చేనేత జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వారసత్వ సాంస్కృతిక కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : బహ్మ్రపుత్ర నది ఒడ్డున, గువాహటి, అస్సాం
ఇప్పుడే చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్