Gandhi Jayanti: అతిపెద్ద చేనేత జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు?
225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, వెయ్యి కిలోల భారీ చేనేత మువ్వన్నెల పతాకాన్ని అక్టోబర్ 2న లద్దాఖ్‌లోని లెహ్‌లో భారత సైన్యం ఆవిష్కరించింది. గాంధీ జయంతి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లను పురస్కరించుకుని లెహ్ గారిసన్‌లో దీనిని ఒక పర్వతంపై ఆవిష్కరించారు. ముంబైలోని ఖాదీ గ్రామోద్యోగ్ చేనేత విభాగం దీనిని తయారు చేసింది. ఇప్పటి వరకు దేశంలో తయారైన అతిపెద్ద చేనేత జాతీయ జెండా ఇదే.
అహింసా దినోత్సవం
భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు. 2007 నుంచి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని అక్టోబర్ 2న ఒక సందేశం విడుదల చేశారు.
చదవండి: ప్రధాని మోదీ ప్రారంభించిన రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తయారైన అతిపెద్ద చేనేత జాతీయ జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : భారతీయ సైన్యం
ఎక్కడ : లెహ్, లద్దాఖ్
ఎందుకు : గాంధీ జయంతి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లను పురస్కరించుకుని...
ఇప్పుడే చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్