Jal Jeevan Mission App: ప్రధాని మోదీ ప్రారంభించిన రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ ఉద్దేశం?
జలజీవన్ మిషన్‌లో భాగమైన పథకాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ప్రోత్సహించడానికి అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ‘జల జీవన్ మిషన్’ యాప్‌ను ప్రారంభించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆవాసాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమశాలలతోపాటు సార్వజనిక సంస్థలకు నీటి కనెక్షన్లు అందించడానికి ‘రాష్ట్రీయ జల్ జీవన్ కోష్’ నిధిని కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ నిధికి వ్యక్తులు, సంస్థలు, విదేశాల్లో ఉంటున్న వారు ఎవరైనా చందాలు ఇవ్వొచ్చు.
వీడబ్ల్యూఎస్సీ సభ్యులతో సమావేశం...
ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య కమిటీల(వీడబ్ల్యూఎస్సీ) సభ్యులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై జల జీవన్ మిషన్ అమలు తీరుపై చర్చించారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ రెండేళ్లలో 5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు మోదీ తెలిపారు. గృహాలకు నీటి సరఫరా విషయంలో గత 7 దశాబ్దాల్లో సాధించిన దానికంటే కేవలం ఈ రెండేళ్లలో సాధించిందే అధికమన్నారు.
2019, ఆగస్టులో ప్రకటన...
2019, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్ జీవన్ మిషన్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ కొలాయి నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మిషన్ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో వీడబ్ల్యూఎస్‌సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత.
చదవండి: అర్బన్ 2.0, అమృత్ 2.0 పథకాలు ప్రారంభం
క్విక్ రివ్యూ :
ఏమిటి : జల జీవన్ మిషన్ యాప్, రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : జలజీవన్ మిషన్‌లో భాగమైన పథకాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ఆవాసాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమశాలలతోపాటు సార్వజనిక సంస్థలకు నీటి కనెక్షన్లు అందించడానికి...
ఇప్పుడే చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్