Young Innovators: కేంద్రం చేపట్టిన స్టార్ కాలేజ్ మెంటార్‌షిప్ కార్యక్రమ ఉద్దేశం?
యువ ఆవిష్కర్తల కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘డీబీటీ–స్టార్ కాలేజ్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్’ ప్రారంభమైంది. నవంబర్ 8న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవంలో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా... దేశంలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన స్టార్ కళాశాలల్లో బోధనను బలోపేతం చేస్తారు. డిగ్రీ స్థాయిలో కోర్సులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఈ కళాశాలలు పనిచేస్తాయి. దేశ వ్యాప్తంగా 278 కళాశాలల్లో స్టార్ కాలేజ్ కార్యక్రమం అమలవుతోంది.
చదవండి: గవర్నర్ల 51వ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డీబీటీ–స్టార్ కాలేజ్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల్లో యువతకు తోడ్పాటు అందించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్