Ram Nath Kovind: గవర్నర్ల 51వ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లనుద్దేశించి ప్రసంగిస్తూ... గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగడం ఇది నాలుగోసారి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. తాజా సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.
చదవండి: జన జాతీయ గౌరవ్ దివస్‌గా ఏ రోజును ప్రకటించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గవర్నర్ల 51వ సదస్సునుద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్