Skip to main content

PM Modi: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి నెలకొనాలి: మోదీ

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
There should be peace between Russia and Ukraine: Modi
There should be peace between Russia and Ukraine: Modi

రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సిద్ధంగా ఉన్నామని ఇంధన రంగంలో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు. రష్యాలోని వ్లాడివోస్తోక్‌లో సెప్టెంబర్ 7 న నిర్వహించిన ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించారు. 

also read: Quiz of The Day (September 07, 2022): భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారైంది?

ఈ సదస్సుకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ కూడా హాజరయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పట్నుంచి చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం జరగాలనే భారత్‌ గట్టిగా చెబుతోందని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి తాము మద్దతునిస్తామని చెప్పారు. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబంగా మారిపోవడంతో ఎక్కడ ఏం జరిగినా యావత్‌ ప్రపంచంపై దాని ప్రభావం పడుతోందని మోదీ అన్నారు. దీనికి ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనాయే ఉదాహరణని పేర్కొన్నారు.  

also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 7th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Sep 2022 06:08PM

Photo Stories