Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 7th కరెంట్ అఫైర్స్
Covid vaccine: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు DCGI అనుమతి
ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్‌కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ సెప్టెంబర్ 7 న ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్.
Also read: COVID-19: వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
UK PM: పగ్గాలు చేపట్టిన లిజ్
హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్2 లాంఛనంగా నియమించారు. ఎలిజబెత్2 హయాంలో ట్రస్ 15వ ప్రధాని కావడం విశేషం! 1952లో విన్‌స్టన్ చర్చిల్ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితుడయ్యారు. ప్రధానిగా తొలి ప్రసంగం అనంతరం తన కేబినెట్‌ను ఆమె ప్రకటించనున్నారు. భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బెవర్మన్‌ను హోం మంత్రిగా ట్రస్ ఎంచుకున్నారు. ప్రధాని పీఠం కోసం ట్రస్‌తో చివరిదాకా హోరాహోరీ పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మాత్రం ఆమె కేబినెట్లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు.
Also read: Quiz of The Day (September 07, 2022): భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారైంది?
US Intelligence Report: రష్యాకు ఉత్తర కొరియా రాకెట్లు
ఉక్రెయిన్‌తో యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడానికి రష్యా సన్నాహాలు చేస్తోంది. లక్షల సంఖ్యలో రాకెట్లు, శతఘ్నులు ఉత్తర కొరియా నుంచి కొనుగోలు చేసే ప్రక్రియను రష్యా రక్షణ శాఖ ప్రారంభించిందని అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. భవిష్యత్‌లో కూడా మిలటరీ పరికరాల్ని రష్యా ఉత్తర కొరియా నుంచే కొనుగోలు చేస్తుందని ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
Telangana: బుద్ధవనంలో రూ.100 కోట్ల పెట్టుబడులు
నాగార్జునసాగర్ తీరంలో నిర్మించిన బుద్ధవనంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ దేశానికి చెందిన సంస్థ ముందు కొచ్చింది. దీంతోపాటు బెంగళూరుకు చెందిన మరో సంస్థ కూడా పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది. ఈ రెండు సంస్థలు కలిసి రూ. 100 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. బుద్ధవనంలో తమకు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే రూ.75 కోట్లతో అక్కడ బౌద్ధస్తూపం, ఆరామం, ధ్యానమందిరం, ఆధ్యాత్మిక విద్యాకేంద్రం, బౌద్ధ భిక్షువుల శిక్షణ కేంద్రం, ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తైవాన్‌కు చెందిన ఫొగంగ్‌షాన్ సంస్థ ప్రకటించింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మహాబోధి సొసైటీ..పదెకరాల స్థలా న్ని కేటాయిస్తే రూ.25 కోట్లతో బౌద్ధస్తూపం, ఆరామం, గ్రంథాలయం, భిక్షు శిక్షణాలయం, ధ్యానమందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 5th కరెంట్ అఫైర్స్
Suresh Raina Retires: క్రికెట్‌కు రైనా వీడ్కోలు
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్వదేశంలో జరిగే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు సెప్టెంబర్ 7 న ప్రకటించాడు. దాంతో అతను విదేశాల్లో జరిగే టి20 లీగ్‌లలో పాల్గొనేందుకు అర్హుడవుతాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన రైనా దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో చివరిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఐపీఎల్ టోర్నీలో ఆడిన రైనాను ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. 2008 నుంచి 2021 వరకు వరుసగా 13 ఐపీఎల్ సీజన్‌లు ఆడిన రైనా మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బెట్టింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండేళ్ల నిషేధం విధించిన సమయంలో రైనా 2016, 2017 ఐపీఎల్ టోర్నీలలో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: కెన్యా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
Asian Junior and Cadet TT Championship:భారత జోడీకి స్వర్ణం
ఆసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది. లావోస్‌లో సెప్టెంబర్ 7 న ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాయస్ జైన్–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్ జిన్‌యువాన్–కిన్ యుజువాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్–19 బాలుర డబుల్స్‌లో, అండర్–19 బాలికల సింగిల్స్‌లో, అండర్–19 బాలుర టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి.
Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank:2022 నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలలో ఏ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది?
SANGAM BARRAGE: 26 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో నిర్మిస్తాం : ఏపీ సీఎం వైఎస్ జగన్
సంగం, నెల్లూరు బ్యారేజీలు మాత్రమే కాకుండా, దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ ప్రాధా న్యతా క్రమంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 26 ప్రాజెక్టులనూ నిర్మిస్తామని చెప్పారు.
Also read: SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు
సెప్టెంబర్ 7 న ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్క రించారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 6th కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP