Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 6th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 6th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 6th 2022
Current Affairs in Telugu September 6th 2022

COVID-19: వాయిస్‌ విని వైరస్‌ గుట్టు చెప్పేస్తుంది

కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్‌ సోకిందో లేదో ఈ యాప్‌ చెప్పగలదు. కోవిడ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్‌ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్‌ చేసి చెక్‌ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్‌ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌లో ఈ యాప్‌ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఈ యాప్‌ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. 

Also read: Quiz of The Day (September 06, 2022): వివాహం ద్వారా ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?

కోవిడ్‌ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్‌ గుర్తిస్తుందని నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్‌ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్‌ రోగుల వాయిస్‌లూ ఉన్నాయి. యాప్‌ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్‌ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్‌ చేసిన యాప్‌ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. 

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: IFFM 2022లో "ఉత్తమ నటి అవార్డు" ఎవరు గెలుచుకున్నారు?

Liz Truss: బ్రిటన్‌ మూడో మహిళా పీఎంగా రికార్డు 

 బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్‌ (లిజ్‌) ట్రస్‌ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సెప్టెంబర్ 5 న వెల్లడైన ఫలితాల్లో ట్రస్‌ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. 

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తున్నారు?

మార్గరెట్‌ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్‌. తాత్కాలిక ప్రధాని జాన్సన్‌ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 5th కరెంట్‌ అఫైర్స్‌

అంచెలంచెలుగా ఎదిగి... 
బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ కాగా తల్లి నర్స్‌ టీచర్‌. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్‌ఫోక్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్‌ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్‌–ఇంగ్లండ్‌ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్‌ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్‌ హ్యూ ఓ లియరీని ట్రస్‌ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్‌ పేరుబడ్డారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్‌) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్‌ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ వస్త్రధారణను అనుకరించారు.

Also read: Weekly Current Affairs (National) Bitbank: భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా కింది వాటిలో ఏది ఆమోదించబడింది?

SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు​​​​​​​

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సెప్టెంబర్ 5 న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ఉపాధి లభించనుంది.

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 3rd కరెంట్‌ అఫైర్స్‌

ఇందులో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్‌ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్‌ ఎనర్జీ పాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలార్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌.. రోల్డ్‌ గ్లాసెస్‌ తయారీ యూనిట్‌తో పాటు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్‌ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్‌ ఫార్మా, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్‌ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.   

Also read: Quiz of The Day (September 03, 2022): తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?

Sahitya Puraskar: తనికెళ్లకు లోక్‌నాయక్‌ పురస్కార ప్రదానం


లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సెప్టెంబర్ 5 న ప్రదానం చేశారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను మద్దిల పాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజో రం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు, సినీ నటుడు డాక్టర్‌ మంచు మోహన్‌బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎన్‌ జయప్రకాశ్‌ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్‌ లక్ష్మణ్‌లను కూడా సత్కరించారు.

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: కెన్యా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

Aleph Book Company: ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ

జాతీయ స్థాయిలో అలోఫ్‌ బుక్‌ కంపెనీ ప్రచురించిన ఉత్తమ కథల సంకలనంలో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన యువ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్‌ కథకు చోటు లభించింది. ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థగా దక్షిణాసియా దేశాల్లో ఎంతో ఆదరణగల అలోఫ్‌ బుక్‌ కంపెనీ ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన భారతీయ ఉత్తమ వర్తమాన కథల ఆంగ్ల సంకలనంలో తెలుగు నుంచి వేంపల్లె షరీఫ్‌ రాసిన ‘ఒంటి చేయి’ కథకు చోటు దక్కింది. దేశంలోని వివిధ భాషల్లో 40 మంది ఉత్తమ వర్థమాన కథలతో ఆ కంపెనీ ‘ఏ కేస్‌ ఆఫ్‌ ఇండియన్‌ మార్వెల్స్‌’ పేరిట పుస్తకాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ సీఈఓ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. 
ఇక షరీఫ్‌ కథను బెంగళూరుకు చెందిన ప్రముఖ అనువాదకులు ఎన్‌ఎస్‌ మూర్తి ‘క్రిపుల్డ్‌ వరల్డ్‌’ పేరుతో అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమి ద్వైమాస పత్రిక ది ఇండియన్‌ లిటరేచర్‌లో కూడా ఈ కథ ఆంగ్ల అనువాదం ప్రచురితమైంది. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 2nd కరెంట్‌ అఫైర్స్‌

Teachers Day 2022 Awards: ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ గుర్తింపు
​​​​​​​

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పురస్కారాలు అందుకున్నవారిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒకరు ఉన్నారు. 
తెలంగాణ నుంచి మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబ్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన టి.ఎన్‌ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన కందాళ రామయ్య, హైదరాబాద్‌ నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సునీతరావు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ నుంచి విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డాక్టర్‌ రావి అరుణకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కా రాన్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 5th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Sep 2022 04:50PM

Photo Stories