Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 2nd కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 2nd 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 2nd 2022
Current Affairs in Telugu September 2nd 2022

NITI Aayog వర్కింగ్‌ గ్రూప్‌లో ఏపీకి చోటు
రానున్న ముప్పై ఏళ్లలో వ్యవసాయ విధానాల రూపకల్పన కోసం నీతి ఆయోగ్‌ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జాతీయ­స్థాయి వర్కింగ్‌ గ్రూప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన ఆహార ఉత్పత్తుల దిగుబడులను పెంచుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పాలసీల రూపకల్పనలో ఈ కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. వ్యవసాయం, ఉద్యానం, పట్టు, పశుసంవర్థక, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ఈ కమిటీ రూపొందించే విధానాలను కేంద్రం అమలుచేస్తుంది.    

Also read: Telangana GSDP: తెలంగాణ జీఎస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు

Worlds Biggest Temple: అతిపెద్ద వేదిక్‌ ప్లానిటోరియం టెంపుల్‌ని నిర్మిస్తున్న ఇస్కాన్ 

ఇస్కాన్‌ సంస్థ పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక్‌ ప్లానిటోరియం టెంపుల్‌ నిర్మిస్తోంది.  ఈ ఆలయ ఫొటోలను ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌ (ఇస్కాన్‌) సంస్థ నిర్వాహకులు ఇటీవలే ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 2010లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు విలువ వంద మిలియన్‌ డాలర్లట. విశ్వంలోని వివిధ గ్రహాల కదలికలకు ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారట. వేదాల ప్రకారం విశ్వం గురించి, ఇతర పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశంలోని ఐకానిక్‌ భవనాల జాబితాలో చేరనున్న ఈ ఆలయం.. వాటికన్‌లోని సెయింట్‌పాల్‌ కేథడ్రల్‌ కంటే, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ కంటే పెద్దది. ఆలయ డోమ్‌ సైతం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇకనుంచి ఇస్కాన్‌ సంస్థ ప్రధాన కేంద్రంగా పనిచేయనున్నది. అంతేకాదు ఒకేసారి 10వేల మంది భక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉందట. 

Also read: Quiz of The Day (September 02, 2022): భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?

ఈ ఆలయ నిర్మాణ వ్యవహారాలన్ని వ్యాపార దిగ్గజం హెన్రీఫోర్డ్‌ మనవడైన ఆ్రల్ఫెడ్‌ ఫోర్డ్‌ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అంబరీష్‌ దాస్‌గా పేరు మార్చుకున్న ఆయన ఇస్కాన్‌ భక్తుడు. 2024 నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 2022నాటికే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యమయిందని ఇస్కాన్‌ నిర్వాహకులు తెలిపారు. 

Also read: Artemis-1 Mission : ఆర్టెమిస్‌ 1 నిలిపివేసిన నాసా.. కార‌ణం ఇదే..

RRR దక్షిణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌కు చుట్టూ 60, 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. తాజాగా దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి, అలైన్‌మెంట్‌ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. దీనితో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగమమైంది. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 27th కరెంట్‌ అఫైర్స్‌

రెండు భాగాలుగా రోడ్డుతో.. 
హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపగా గతంలో ఓ కన్సల్టెన్సీతో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను రూపొందించారు. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దానికి నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేసే కే అండ్‌ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా.. ఆ సంస్థ సర్వే చేసి ఉత్తర భాగం పొడవును 158.62 కిలోమీటర్లుగా ఖరారు చేసింది. భూసేకరణలో భాగంగా 3ఏ గెజిట్ల విడుదల వరకు కసరత్తు పూర్తి చేసింది. భూసేకరణ అధీకృత అధికారులుగా ఉన్న ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు సంబంధించి ఇటీవలే విడతల వారీగా ఎనిమిది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కూడా.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: పదవీ విరమణ తర్వాత పైలట్‌లు విమానాలను నడిపేందుకు ఏ ఎయిర్‌లైన్ కొత్త విధానాన్ని

ఢిల్లీలోని గ్రీన్‌పార్కు ప్రాంతానికి చెందిన ఇంటర్‌కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ సంస్థకు.. బిహార్, యూపీ రాష్ట్రాల్లో పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే (పాట్నా రింగ్‌ రోడ్డు), గంగా బ్రిడ్జి కనెక్టివిటీ ప్రాజెక్టులను కేంద్రం కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు దక్షిణ భాగానికి డీపీఆర్‌ రూపొందించే బాధ్యతనూ ఇచ్చింది. 

Also read: Weekly Current Affairs (International) Bitbank: 'లులో రోజ్' అనే అతిపెద్ద పింక్ డైమండ్ ఏ దేశంలో కనుగొనబడింది?

GST Collections: ఆగస్టులో GST వసూళ్లు 28% అప్‌

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఆగస్టులో  28% ఎగసి రూ.1,43,612 కోట్లుగా నమోదయ్యాయి. వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుదల, రేట్ల పెంపు, సరళతర పన్ను విధానాలు, ఎగవేతల నిరోధానికి చర్యలు దీనికి కారణం.  జీఎస్‌టీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్ల స్థాయిని దాటడం ఇది వరుసగా ఆరవనెల. పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. మొత్తం వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ వాటా రూ.24,710 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ రూ.30,951 కోట్లు. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.77,782 కోట్లు. సెస్‌ రూ.10,168 కోట్లు. కాగా, ఆగస్టు వసూళ్లు జూలై విలువ (రూ.1.49 లక్షల కోట్లు) కన్నా తక్కువ. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. 

Also read: Quiz of The Day (August 27, 2022): జి.ఎస్.టి. కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించేది ఎవరు?

2022 జనవరి నుంచి ఇలా... 
నెల    జీఎస్‌టీ ఆదాయం (రూ.కోట్లలో) 
జనవరి     1,40,986 
ఫిబ్రవరి    1,33,026 
మార్చి    1,42,095 
ఏప్రిల్‌    1,67,650 
మే     1,40,885 
జూన్‌    1,44,616 
జూలై    1,48,995 
ఆగస్టు     1,43,612

Also read: RBI Statistics : పటిష్ట బాటన భారత్‌ ఎకానమీ..!

GDP Growth Rate: ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం​​​​​​​

ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారత్‌ స్థూల దేశీయోత్పత్తి 13.5 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (2021 ఏప్రిల్‌–జూన్‌) ఎకానమీ వృద్ధి రేటు 20.1 శాతంకాగా, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి)లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 4.09 శాతంగా నమోదయ్యింది. వినియోగం, సేవలుసహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్‌ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ విలువను పరిశీలనలోకి తీసుకునే  గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ)ను తీసుకుంటే మొదటి త్రైమాసి కంలో 12.7 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 17.6%.  

Also read: FM Nirmala Sitharaman: రెండేళ్ల పాటు 7.4 శాతం వృద్ధి

13.5 శాతం వృద్ధి అంటే.. 
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సమాచారం ప్రకారం, 2021–22లో ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జీడీపీ (2011–12 స్థిర ధరల ప్రాతిపదికన) విలువ రూ.32.46 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.36.85 లక్షల కోట్లు. వెరసి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది.  ఇక జీవీఏను విలువను తీసుకుంటే,  ఇది 12.7 శాతం వృద్ధితో రూ.34.41 లక్షల కోట్లుగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్‌ జీడీపీ (కరంట్‌ ప్రైసెస్‌ వద్ద) విలువ మొదటి త్రైమాసికంలో 26.7 శాతం ఎగసి రూ.51.27 లక్షల కోట్ల నుంచి రూ.64.95 లక్షల కోట్లకు ఎగసిందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది.  

Also read: RBI Statistics : పటిష్ట బాటన భారత్‌ ఎకానమీ..!

సవాళ్లు ఉన్నాయ్‌... 
రానున్న త్రైమాసికాల్లో వృద్ధి తీరుపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల భారం, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ఇక్కడ ప్రధానమైనవి. మొదటి త్రైమాసికంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదవడం గమనార్హం.  2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది. సమీక్షా కాలంలో తయారీ రంగం 4.8 శాతంగా నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఎగుమతులకన్నా, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడమూ సమస్యాత్మకమే. దీనికితోడు వర్షపాతం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధంగా లేనందున వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. గడచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతుండడంతో మే నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.40 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 5.4 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా వడ్డీరేట్ల పెంపు బాటన నడవడం ప్రారంభించాయి.  

Also read:5G services: 4జీ చార్జీలకే 5జీ సేవలు!

7–7.5 శాతం శ్రేణిలో ఉండవచ్చు: కేంద్రం 
భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కేంద్రం భావిస్తోంది. 2021–22లో భారత్‌ 8.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 

Also read: Andhra Pradesh: వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఏపీ

Green Hydrogen Hub గా ఆంధ్రప్రదేశ్‌ 

 గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఏపీ భాగం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి జరగనుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు, నీతీ ఆయోగ్‌కు ఇండియా హైడ్రోజన్‌ అలయన్స్‌ (ఐహెచ్‌2ఏ) తాజాగా సమర్పించిన హైడ్రోజన్‌ హబ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ హబ్‌లను రూపొందిస్తారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు ఏర్పాటు చేసి, వీటిని 25 ప్రాజెక్ట్‌ క్లస్టర్లుగా విభజిస్తారు. వీటి ద్వారా 2025 నాటికి గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే 150 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ఐహెచ్‌2ఏ నిర్దేశించింది. వీటిని మొదటి తరం జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ను వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్‌) మధ్య నేషనల్‌ గ్రీన్‌ స్టీల్, కెమికల్స్‌ కారిడార్‌లోని  స్టీల్, కెమికల్‌ ప్లాంట్ల కోసం 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్‌తో సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల పదేళ్లలో వాతావరణంలో 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించవచ్చు. విశాఖపట్నంలో నేషనల్‌ గ్రీన్‌ రిఫైనరీ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌లో 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్‌తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇది ఒక దశాబ్దంలో 4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. దీని కోసం రాష్ట్ర గ్రీన్‌ హైడ్రోజన్‌ విధానాలను రూపొందించనున్నారు.

Also read: Merger of subsidiaries: అనుబంధ సంస్థల విలీనం పూర్తి: NTPC

5 రాష్ట్రాలకు Grant in aid రూ. రూ.4,189.58 కోట్లు విడుదల ​​​​​​​
​​​​​​​

ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ.4,189.58 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విడుదల చేసింది. ఏపీకి రూ.569.01 కోట్లు, కర్ణాటకకు రూ.628.07 కోట్లు, త్రిపురకు రూ.44.10 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ. 2,239.80 కోట్లు, గుజరాత్‌కు రూ.708.60 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లకు విడుదలైన నిధులు 2022–23 సంవత్సరానికి సంబంధించిన టైడ్‌ గ్రాంట్లలో 1వ విడత కాగా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లకు విడుదలైనవి 2021–22 సంవత్సరపు టైడ్‌ గ్రాంట్ల 2వ విడత అని వివరించింది. 

Also read: World Bank Report : రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల.. టాప్‌-1లో..

పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత నిర్వహణ, తాగునీటి సరఫరా, వర్షపునీటి సేకరణ, నీటి రీసైక్లింగ్‌ అనే కీలకమైన సేవలను మెరుగుపరిచేందుకు తాగునీరు, పారిశుద్ధ్య శాఖల సూచనలతో గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు టైడ్‌ గ్రాంట్లు విడుదలయ్యాయని పేర్కొంది. పంచాయతీరాజ్‌ సంస్థలకు కేటాయించిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో 60 శాతం జాతీయ ప్రాధా న్యతలైన తాగునీటి సరఫరా, వర్షపునీటి సంరక్షణ, పారిశుద్ధ్యం కోసం కేటాయించారని, 40 శాతం అన్‌ టైడ్‌ నిధులు స్థానిక నిర్దిష్ట అవసరాల కోసం పంచాయతీరాజ్‌ సంస్థల విచక్షణ ప్రకారం వినియోగిస్తారని వివరించింది. 2022–23లో ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.15,705.65 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.   

Also read: Britain GDP: 300 ఏళ్లలోనే అత్యంత కనిష్టానికి బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Sep 2022 06:30PM

Photo Stories