Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 5th కరెంట్ అఫైర్స్
US: తైవాన్‌కు భారీగా అమెరికా ఆయుధాలు
తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ, ఆ దేశానికి 109 కోట్ల డాలర్ల ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా సెప్టెంబర్ 2 న తుది ఆమోదం తెలిపింది. 65.5 కోట్ల డాలర్ల నిఘా పరికరాలు, 35.5 కోట్ల డాలర్ల హర్పూన్ క్షిపణులు, 85 మిలియన్ డాలర్ల సైడ్‌విండర్ క్షిపణులను తైవాన్ కొనుగోలుచేయనుంది. వీటితో తైవాన్ స్వీయ రక్షణ సామర్థ్యం మరితం మెరుగు పడుతుందని వైట్‌హోస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
NASA: ఆర్టెమిస్ మళ్లీ ఆగింది
చంద్రుడిపైకి పంపించేందుకు నాసా నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఆర్టెమిస్ ప్రయోగం రెండోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 3 న మధ్యాహ్నం జరగాల్సిన ప్రయోగాన్ని భారీ ఇంధన లీకేజీ కారణంగా వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. 322 అడుగుల ఎత్తైన ఈ భారీ రాకెట్‌లోకి 10 లక్షల గ్యాలన్ల ద్రవీకృత హైడ్రోజన్ ఇంధనాన్ని నింపే కార్యక్రమం మొదలైన కాసేపటికే ఇంధనం లీకవుతున్నట్లు గుర్తించారు. ఎంత ప్రయత్నించినా లీకేజీ ఆగకపోవడంతో ప్రయోగం వాయిదా పడింది. గత ఆగష్టు 29 న కూడా సెన్సార్ల లోపం, ఇంధన లీకేజీ వల్ల ప్రయోగం ఆఖరి క్షణంలో వాయిదా పడింది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: IFFM 2022లో "ఉత్తమ నటి అవార్డు" ఎవరు గెలుచుకున్నారు?
Fifth Strongest Economy: ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
2022 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్‌ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు ఉంటే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తున్నారు?
NASA: సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహ చిత్రాలను తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్‌ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్‌ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 1వ ఎడిషన్ ఏ సంవత్సరం నాటికి ప్రారంభమవుతుంది?
Dubai Open Chess: దుబాయ్ ఓపెన్ చెస్ విజేత అరవింద్
భారత యువ గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం దుబాయ్ ఓపెన్ మాస్టర్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల అరవింద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో అరవింద్ ఆరు గేముల్లో నెగ్గి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. అరవింద్‌కు 13,000 డాలర్ల (రూ. 10 లక్షల 36 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ ఏడో ర్యాంక్‌లో, హర్ష భరతకోటి పదో ర్యాంక్‌లో, రాజా రిత్విక్ 21వ ర్యాంక్‌లో నిలిచారు.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 1వ ఎడిషన్ ఏ సంవత్సరం నాటికి ప్రారంభమవుతుంది?
Twenty20 International: ముష్ఫికర్ రహీమ్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు గుడ్‌బై
టెస్టు, వన్డే ఫార్మాట్‌లపై మరింత దృష్టి సారించేందుకు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే టి20 ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలలో మాత్రం ఆడతానని 35 ఏళ్ల ముష్ఫికర్ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ తరఫున 102 టి20 మ్యాచ్‌లు ఆడిన ముష్ఫికర్ 1,500 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Also read: Tennis Star Serena Williams Retires: 27 ఏళ్ల కెరీర్‌కు సెరెనా విలియమ్స్ గుడ్ బై
Max Verstappen: ఎఫ్1 సీజన్‌లో పదో విజయం సాధించిన వెర్‌స్టాపెన్
ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఫార్ములావన్ (ఎఫ్1) 2022 సీజన్‌లో పదో విజయం నమోదు చేశాడు. సొంతగడ్డపై సెప్టెంబర్ 4 న జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్‌స్టాపెన్ 319 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్‌స్టాపెన్ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్ షుమాకర్ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), సెర్గియో పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 2nd కరెంట్ అఫైర్స్
Ultimate Kho Kho: ఖో–ఖో లీగ్ విజేత ఒడిశా జగర్‌నాట్స్
చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ పైచేయి సాధించి అల్టిమేట్ ఖో–ఖో లీగ్ చాంపియన్‌గా అవతరించింది. సెప్టెంబర్ 4 న జరిగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ 46–45తో ఒక్క పాయింట్ తేడాతో తెలుగు యోధాస్ జట్టును ఓడించింది. ఒడిశాకు చిరస్మరణీయ విజయం సొంతమైంది.
Also read: Weekly Current Affairs (National) Bitbank: భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా కింది వాటిలో ఏది ఆమోదించబడింది?
విజేతగా నిలిచిన ఒడిశా జట్టుకు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది.
రన్నరప్ తెలుగు యోధాస్‌కు రూ. 50 లక్షలు...
మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్‌కు రూ. 30 లక్షలు లభించాయి.
‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు రామ్‌జీ కశ్యప్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 5 లక్షలు)..
‘బెస్ట్ అటాకర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అభినందన్ పాటిల్ (గుజరాత్; రూ. 2 లక్షలు)...
‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీపక్ మాధవ్ (తెలుగు యోధాస్; రూ. 2 లక్షలు)...
‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు మదన్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 2 లక్షలు) గెల్చుకున్నారు.
Also read: INS Vikrant : ఐఎన్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశం
ATP 2022 Challenger: సాకేత్–యూకీ జోడీకి టైటిల్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని ఐదో చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రాఫా నాదల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–2, 6–2తో మారెక్ గెన్‌జెల్–లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 2,670 యూరోల (రూ. 2 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Indian Exports: ఆగస్టులో వృద్ధిలేకపోగా 1.15% క్షీణత
భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఇక దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు రెట్టింపునకు పైగా పెరిగి, 28.68 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు భారీగా పెరగడానికి క్రూడ్ ఆయిల్ దిగుమతులు ప్రధాన కారణం. ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Also read: Telangana GSDP: తెలంగాణ జీఎస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు
Central Rural Development Department: ముఖరా(కె).. అవార్డులన్నీ ఆ ఊరికే..
వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలతో జాతీయ స్థాయి లో ప్రత్యేకతను చాటుతోన్న ముఖరా (కె) గ్రామం తాజాగా మరో జాతీయస్థాయి గుర్తింపును పొందింది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి మంత్రిత్వశాఖ ఆ గ్రామం గురించి చేసిన ట్వీ ట్‌లో ప్రశంసించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థా నికీకరణ లోగోని ప్రభుత్వ భవనాల గోడలపై ఆవిష్కరించడంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ లం ముఖరా(కె) గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొంది.
Also read: Solar Power: దేశంలో రికార్డ్‌స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి
ఇదీ సృజనాత్మకత
- మన రాష్ట్రం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ‘సశక్త్ పంచాయత్ సతత్ వికాస్’పేరుతో ఆయా లోగోలను గ్రామపంచాయతీ భవనం ప్రహరీపై ముద్రించారు. ‘తెలంగాణలో విరామం ఎరుగని నిరంతర పంచాయతీ అభివృద్ధి, బలమైన పంచాయతీ, సుస్థిరమైన అభివృద్ధి’అనే ట్యాగ్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. ఈ పెయింటింగ్స్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతా ల ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నాయి.
- 500 జనాభా ఉన్న ముఖరా(కె) గ్రామంలో 300 ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలోనే మొదటి మలమూత్ర విసర్జనరహిత గ్రామంగా ఎంపికైంది.
- పచ్చదనంలోనూ, స్వచ్ఛతలోనూ అగ్రగామిగా నిలిచి జాతీయస్థాయి అవార్డు సైతం అందుకుంది.
- గ్రామంలో మూడేళ్లుగా గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా 40 వేల మొక్కలు నాటారు. పల్లెప్రకృతి వనం, వైకుంఠధామంతో పాటు రోడ్డుకు ఇరువైపులా, ప్రతి ఇంటి అవరణలో వీటిని నాటి సంరక్షిస్తున్నారు.
- గ్రామంలో పెళ్లయిన నూతన జంటతో వారి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడి పల్లె ప్రకృతి వనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది.
- డిజిటల్ లిటరసీలోనూ ఈ గ్రామం జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2016లో పెద్దనోట్ల రద్దుతో దేశమంతా ఇబ్బందులు పడినా ఈ గ్రామస్తులు మాత్రం దీన్ని అధిగమించారు. అప్పటికే వందశాతం నగదు రహిత గ్రామంగా పేటీఎం, స్వైపింగ్ మిషన్ల ద్వారా డబ్బులు ఖాతాల నుంచి తీసుకొని రూపే కార్డుల ద్వారా లావాదేవీలు చేపట్టింది.
Also read: Largest Private Hospital in Asia: ఫరీదాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రి
NCRB report for 2021: మానవ అక్రమ రవాణా తగ్గడం శుభపరిణామం
ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని, గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అనేందుకు ఇదే సంకేతమని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కార్యదర్శి రామమోహన్ నిమ్మరాజు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా కృషి చేస్తున్న రామమోహన్ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)–2021 నివేదికపై సెప్టెంబర్ 4 న స్పందించారు. గతేడాది ప్రతి జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 2020లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021లో ఐదో స్థానానికి తగ్గిందన్నారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో తెలంగాణ, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నాయన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 99.3 శాతం కేసుల్లో పోలీసులు చార్జిషీట్ వేయడం, 757 మందిని అరెస్టు చేయడం ఒక రికార్డు అని రామమోహన్ వివరించారు.
Also read: Indian Polity Bit Bank For All Competitive Exams: భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?
Family doctor: ఫోన్ కాల్‌తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్‌కు ప్రత్యేక యాప్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో సన్నద్ధమైంది. త్వరలో ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్లు అందచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పిస్తున్నారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: కెన్యా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఇప్పటికే టెలి మెడిసిన్ సేవలు.. టాప్‌లో ఏపీ
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వైద్య ఆరోగ్య రంగంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది. టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా సచివాలయం యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందచేస్తోంది. ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తై పంపిణీ కొనసాగుతోంది. ఒకవేళ వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయిస్తోంది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: "ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్" అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది?
+ విలేజ్ క్లినిక్స్‌లో వివరాలు..
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా పీహెచ్‌సీలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని సచివాలయాలను విభజిస్తున్నారు. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడి పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఫోన్ నంబర్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చు. తమ సమస్యను వివరించి సలహాలు, సూచనలు పొందవచ్చు. విలేజ్ క్లినిక్‌కు వెళ్లి వైద్యుడు సూచించిన మందులను తీసుకోవచ్చు. మరోవైపు స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు అవసరమైనవారు విలేజ్ క్లినిక్‌లో సంప్రదిస్తే టెలీ మెడిసిన్ ద్వారా ఆయా వైద్యులతో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) మాట్లాడిస్తారు.
Also read: Weekly Current Affairs (National) Bitbank: భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా కింది వాటిలో ఏది ఆమోదించబడింది?
+ ప్రత్యేక యాప్
ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తోంది. సచివాలయాల వారీగా వలంటీర్ల క్లస్టర్ల ప్రాతిపదికన ప్రజల వివరాలను యాప్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (జీవన శైలి జబ్బులు) సర్వేలో భాగంగా వైద్య శాఖ ప్రజలను స్క్రీనింగ్ చేస్తోంది. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తోంది. ఆ వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానిస్తున్నారు. యాప్‌లో వైద్యాధికారులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఎంఎల్‌హెచ్‌పీలు, సచివాలయ ఏఎన్‌ఎంలు.. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా లాగిన్ ఉంటుంది. పీహెచ్‌సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు రోగి ఏ క్లస్టర్ పరిధిలో ఉంటారో చెబితే చాలు దాని ఆధారంగా ఎన్‌సీడీ సర్వేతో సహా సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఆరోగ్య సమస్య ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు. ఆ వివరాలతో పాటు అవసరమైన మందులను కూడా యాప్‌లో నమోదు చేస్తారు. మందుల ప్రిస్క్రిప్షన్ ఎంఎల్‌హెచ్‌పీ లాగిన్‌కు వెళుతుంది. దాని ఆధారంగా రోగికి ఎంఎల్‌హెచ్‌పీ మందులను అందిస్తారు. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు తదితర వివరాలన్నీ సంబంధిత వ్యక్తి డిజిటల్ హెల్త్ ఐడీలో అప్‌లోడ్ చేస్తారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వైద్యుడే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేసే ఆప్షన్‌ను కూడా యాప్‌లో కల్పిస్తున్నారు.
Also read: Weekly Current Affairs (International) Bitbank: ఓమిక్రాన్ వ్యాక్సిన్‌ను ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది?
+ ఇబ్బందులు ఎదురవకుండా..
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్‌సీ పరిధిలోని గ్రామ సచివాలయాలను ఇద్దరు వైద్యులకు విభజిస్తారు. రోజు మార్చి రోజు పీహెచ్‌సీ వైద్యుడు తనకు కేటాయించిన సచివాలయాలను సందర్శించాలి. వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో పాటు గ్రామాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గ్రామంలో ఉండి వైద్యసేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో వారికి సచివాలయాల్లోనే హాజరు నమోదుకు వీలు కల్పిస్తున్నారు.
వైద్యుడితో పాటు ఏఎన్‌ఎంలు గ్రామంలో సేవలు అందించేలా ఉదయం 9 గంటలు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ నమోదు చేసుకునేలా పనివేళలు మార్పు చేయనున్నారు.
Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank:2022 నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలలో ఏ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP