Skip to main content

INS Vikrant : ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జలప్రవేశం

 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్‌ చేసి, నిర్మించిన అత్యంత భారీ విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సెప్టెంబర్ 2 న జలప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఇందుకు వేదికగా మారింది.
INS Vikrant: Inside India’s newly-commissioned aircraft carrier
INS Vikrant: Inside India’s newly-commissioned aircraft carrier

భారీ యుద్ధ నౌకలను సొంతంగా నిర్మించుకొనే సామర్థ్యం గల అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా సగర్వంగా చేరింది. ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జల ప్రవేశానికి సూచికగా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విక్రాంత్‌ అంటే విజయమని అన్నారు. విక్రాంత్‌ కేవలం యుద్ధనౌక కాదని, దేశ నైపుణ్యాలకు, ప్రతిభకు సిసలైన తార్కాణమని ఉద్ఘాటించారు. ‘‘ఈ నౌక మన దేశానికి నూతన విశ్వాసాన్ని అందించింది. ఇది సముద్రంలో అలలపై తేలియాడే వైమానిక క్షేత్రం. ఒక నగరం. విక్రాంత్‌లో ఉత్పత్తి చేసే కరెంటుతో 5,000 ఇళ్లకు వెలుగులు పంచవచ్చు’’ అని అన్నారు.

Also read: Worlds Biggest Temple: అతిపెద్ద వేదిక్‌ ప్లానిటోరియం టెంపుల్‌ని నిర్మిస్తున్న ఇస్కాన్

శివాజీ నౌకాదళం ప్రేరణతో..  నౌకాదళానికి కొత్త పతాకం

  • ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రూపొందించిన నావికాదళ నూతన చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ‘‘ఇది చరిత్రాత్మక దినం.  ఈ జెండాను శివాజీకి అంకితమిస్తున్నాం’’ అన్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై నూతన పతాకాన్ని మోదీ ఎగురవేశారు.
  • నావికాదళానికి కొత్త జెండా చేరింది. ఇందులో ఎడమవైపు పైభాగాన జాతీయ జెండా ఉంది, కుడి వైపు కింది భాగంలో ఛత్రపతి శివాజీ ప్రేరణతో ఒక చిహ్నాన్ని చేర్చారు. 
  • నీలం రంగులో అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ చిహ్నంలో రెండు బంగారు రంగు బోర్డర్లున్నాయి. అష్టభుజి ఆకారాన్ని, ఈ రెండు బోర్డర్‌ లైన్లను శివాజీ నౌకాదళం చిహ్నం నుంచి తీసుకున్నారు.
  • అష్టభుజి ఎనిమిది దిక్కులకు సూచిక అని, అన్ని దిక్కుల్లోనూ నౌకాదళం దుర్భేద్యమని తెలియజేయడానికి ఈ చిహ్నాన్ని డిజైన్‌ చేసినట్లు నావికాదళం వెల్లడించింది.  
  • అష్టభుజి మధ్యభాగంలో నాలుగు సింహాల జాతీయ చిహ్నం. లంగరు (యాంకర్‌) గుర్తు డిజైన్‌ చేశారు. దాని కిందిభాగంలో నావికాదళం మోటో ‘సం నో వరుణః’ (వరుణ దేవుడా, మాపై కరుణ కురిపించు) కనిపిస్తోంది. దీన్ని రుగ్వేదం నుంచి స్వీకరించారు. 

Also read: Green Hydrogen Hub గా ఆంధ్రప్రదేశ్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Sep 2022 06:08PM

Photo Stories