Jallikattu, Kambala: జల్లికట్టుకు జై.. ఎడ్ల పందేలు, కంబళ నిర్వహణకూ అనుమతి
ఈ క్రీడలు జంతు హింస పరిధిలోకి రావని స్పష్టంచేస్తూ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన రిజర్వ్ చేసిన తీర్పును మే 17న వెల్లడించింది. ఈ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన సవరణ చట్టాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ‘రాష్ట్రాల్లో చేసిన ఆయా సవరణ చట్టాల్లోని నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూసే బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్/ సంబంధిత కార్యనిర్వహణ వర్గానిదే.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
శతాబ్దాలుగా తమిళనాట జల్లికట్టు క్రీడ కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఆ రాష్ట్ర శాసనసభ చట్టంలో జోక్యం చేసుకునే ఉద్దేశం సుప్రీంకోర్టుకు లేదు. తమిళనాడు సవరణ చట్టంపై మేం తీసుకున్న నిర్ణయమే మహారాష్ట్ర, కర్ణాటక సవరణ చట్టాలకూ వర్తిస్తుంది.’ అని ధర్మాసనంలోని జడ్జీలు తన తీర్పులో స్పష్టంచేశారు. కాగా, ‘తమిళుల సాహసం, సంస్కృతికి దర్పణం ఈ క్రీడ. ఈ తీర్పు తమిళనాడు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. రాష్ట్ర చట్టాన్ని కోర్టు సమర్థించినందుకు సూచికగా వచ్చే జనవరి పొంగళ్ సీజన్‌లో విజయోత్సవ వేడుక చేస్తాం’ అని తీర్పు అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.
కాగా, తీర్పుపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జల్లికట్టులో జనం చస్తున్నా అమూల్య సంప్రదాయమంటూ కోర్టు క్రూరమైన క్రీడను పరిరక్షిస్తోంది. తీర్పుపై న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం’ అని పెటా ఇండియా వ్యాఖ్యానించింది.
Kharif Fertiliser Subsidy: ఖరీఫ్‌లో ఎరువుల రాయితీ రూ.1.08 లక్షల కోట్లు