Skip to main content

Kharif Fertiliser Subsidy: ఖరీఫ్‌లో ఎరువుల రాయితీ రూ.1.08 లక్షల కోట్లు

2023–24 ఖరీఫ్‌ (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) సీజన్‌లో ఎరువులపై రూ.1.08 లక్షల కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం మే 17న‌ ఆమోదముద్ర వేసింది.
Kharif Fertiliser Subsidy

రిటైల్‌ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగకుండా, అన్నదాతలపై ఆర్థిక భారం పడకుండా ఈ రాయితీ తోడ్పడుతుందని తెలియజేసింది. యూరియాపై రూ.70,000 కోట్లు, డీఏపీ, ఇతర ఎరువులపై రూ.38,000 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వివరించారు. ఎరువుల గరిష్ట అమ్మకం ధర(ఎంఆర్‌పీ)లో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో సంచి యూరియా రూ.276, డీఏపీ రూ.1,350 ధర పలుకుతోంది.
సీసీఐ, ఈసీఏ ఒప్పందానికి ఓకే
కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), ఈజిప్షియన్‌ కాంపిటీషన్‌ అథారిటీ(ఈసీఏ); ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ద మాల్దీవ్స్‌ (సీఏ మాల్దీవ్స్‌) మధ్య అవగాహన ఒప్పందాలను కేబినెట్‌ ఆమోదించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)

Published date : 18 May 2023 02:48PM

Photo Stories