Amit Shah: గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లో వెనుకబడిన వర్గాలైన గుజ్జర్, బకర్వాల్, పహాడీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన.. రాజౌరీలో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో ప్రసంగించారు.'జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. వీరికి కొత్తగా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఎస్టీ కోటా ద్వారా లబ్ధి పొందుతున్న వర్గాలకు ఎలాంటి నష్టం జరగబోదు. మూడేళ్ల క్రితం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుచేశాక నేడు ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం వచ్చింది' అని అమిత్ షా అన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Oct 2022 03:55PM