Electoral Bonds: ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు

2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు విరాళం రూపంలో అందజేశారంది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది.
నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లో నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా మార్చి 13వ తేదీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్ రూపంలో అందజేశామని తెలిపారు.