Jharkhand: రిజర్వేషన్లను 77శాతానికి పెంచుతూ ఝార్ఖండ్ శాసన సభలో బిల్లు ఆమోదం
రాష్ట్రంలో షెడ్యూల్డ్‌కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీ), ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తాజా బిల్లు వల్ల 77శాతానికి పెరుగుతాయి. దీనికి చట్టబద్ధత అందించడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో తగు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కొత్త బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. బిల్లు వల్ల ఇకపై స్థానిక షెడ్యూల్డ్‌కులాలకు 12శాతం కోటా, షెడ్యూల్డ్‌తెగలకు 28శాతం, అత్యంత వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) 15శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు(ఓబీసీ)12శాతం, ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం కోటాలు లభిస్తాయి. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో షెడ్యూల్డ్ కులాలకు 10శాతం, షెడ్యూల్డ్ తెగలకు 26 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP