Badminton Rankings: బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో చోటు కోల్పోయిన పీవీ సింధు
Sakshi Education
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు మళ్లీ టాప్–10లో చోటు కోల్పోయింది.
తాజా ర్యాంకింగ్స్‌లో సింధు రెండు స్థానాలు పడిపోయి తొమ్మిది నుంచి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. గత నెలలో 2016 తర్వాత తొలిసారి టాప్–10లో స్థానం కోల్పోయిన సింధు ఈనెల తొలి వారంలో తొమ్మిదో స్థానానికి చేరుకొని మళ్లీ టాప్–10లోకి వచ్చింది. అయితే వారం వ్యవధిలో సింధు ర్యాంక్ మారిపోయింది. భారత్‌కే చెందిన సైనా 31వ ర్యాంక్‌లో, ఆకర్షి 40వ ర్యాంక్‌లో, మాళవిక 42వ ర్యాంక్‌లో, అష్మిత 48వ ర్యాంక్‌లో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గతవారం ఫ్రాన్స్‌లో జరిగిన ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రియాన్షు విజేతగా నిలిచాడు. దాంతో ప్రియాన్షు 20 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్‌లో నిలిచాడు.
ATP Rankings: ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
Published date : 12 Apr 2023 03:04PM