President Kovind: చామరాజనగర మెడికల్ ఆస్పత్రిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలోని చామరాజనగర శివార్లలో 450 పడకల చామరాజనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 7న ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలోని బిళిగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని కోవింద్ దర్శించుకున్నారు.
35 పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభం
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లను నెలకొల్పే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్ స్వింగ్ అబ్సార్ప్‌షన్(పీఎస్‌ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను మోదీ అక్టోబర్ 7న ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ‘ఎయిమ్స్’ ఈ కార్యక్రమానికి వేదికగా మారింది.
చదవండి: దేశంలో కొత్తగా ఎన్ని మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటుకానున్నాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : చామరాజనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : అబ్దుల్ రజాక్ గుర్నా(73)
ఎక్కడ : చామరాజనగర శివారు ప్రాంతం, చామరాజనగర జిల్లా, కర్ణాటక రాష్ట్రం
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
డౌన్‌లోడ్ వయా ఆపిల్ ఐ స్టోర్