Skip to main content

PM-MITRA: దేశంలో కొత్తగా ఎన్ని మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటుకానున్నాయి?

Textile Industry

దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు ‘‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ పార్కు’’ (పీఎం మిత్ర)ల ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ అక్టోబర్‌ 6న ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి.

ముఖ్యాంశాలు...

  • ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే ఈ టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు.
  • ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌/బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
  • అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్‌ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు అందించనున్నారు.
  • ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్‌ ఫండ్‌ సైతం అందజేయనుంది.
  • ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా.
  • టెక్స్‌టైల్‌ పార్కులో వర్కర్స్‌ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్‌ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు టెక్స్‌టైల్‌ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

చ‌దవండి: ఏ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కొత్తగా ఏడు ‘‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ పార్కు’’ (పీఎం మిత్ర)ల ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు  : అక్టోబర్‌ 6
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికి...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 07 Oct 2021 12:57PM

Photo Stories