PM Narendra Modi: రూ.75 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రధాని మోదీ డిసెంబర్ 11న రూ.75 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. నాగపూర్–ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేలో షిర్డీ దాకా తొలి దశని ప్రారంభించిన మోదీ ఆ రహదారిపై కాసేపు కారులో ప్రయాణించారు. నాగపూర్–బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును, నాగపూర్ మెట్రో రైలు, ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ కేంపస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశాభివృద్ధి విషయంలో సంకుచిత ధోరణి ప్రదర్శిస్తే అవకాశాలు పరిమితంగానే లభిస్తాయన్నారు. ‘‘అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధితోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలబడుతుంది. సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అన్న సూత్రంతోనే ముందుకు వెళుతున్నాం’’ అని చెప్పారు.
Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా సక్సెస్ సిక్రెట్ ఇదే..
ఆయుర్వేదం వైపు ప్రపంచం చూపు
ప్రపంచ దేశాలన్నీ ఆయుర్వేదం వైపు చూస్తున్నాయని మోదీ చెప్పారు. గోవాలో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఘజియాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసన్, ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలను గోవా నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. గోవాలో డిసెంబర్ 11న తొమ్మిదో ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపులో పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్యం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.