Skip to main content

Assembly Elections: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ గెలుపు

గుజరాత్‌లో కమలం పార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపడుతూ 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 సీట్లను సొంతం చేసుకుంది. నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించింది.

తద్వారా 1985లో మాధవ్‌సింగ్‌ సోలంకీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టింది. 2002లో సీఎంగా మోదీ నేతృత్వంలో సాధించిన 127 సీట్ల స్వీయ రికార్డునూ మెరుగు పరుచుకుంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు నెగ్గిన పారీ్టగానూ రికార్డు సృష్టించింది. 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి ఇది వరుసగా ఏడో విజయం! తద్వారా పశ్చిమబెంగాల్లో సీపీఎం కూటమి సాధించిన ఏడు వరుస విజయాల రికార్డును బీజేపీ సమం చేసింది. కాంగ్రెస్‌ కేవలం 17 సీట్లతో రాష్ట ఎన్నికల చరిత్రలో అత్యంత ఘోరమైన పరాజయం చవిచూసింది. ఒక్క చాన్సంటూ కేజ్రీవాల్‌ రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆప్‌కు దక్కింది ఐదు స్థానాలే!
ఆద్యంతమూ జైత్రయాత్రే... 
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్‌ పోటాపోటీగా తలపడ్డాయి. డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. డిసెంబర్‌ 8వ తేదీ ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌ మొదలైంది. మొదటినుంచీ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. పారీ్టకి అన్ని వర్గాల నుంచీ సంపూర్ణ మద్దతు లభించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ 77 సీట్లు నెగ్గిన కాంగ్రెస్‌ ఈసారి పూర్తిగా చేతులెత్తేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఈసారి జోడో యాత్ర కారణంగా దూరంగా ఉండటం, ప్రియాంక కూడా హిమాచల్‌తో పోలిస్తే గుజరాత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పార్టీ అవకాశాలను మరింతగా దెబ్బ తీశాయి.

Vijayasai Reddy: రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
పులిమీట పుట్రలా ఆప్‌ కూడా హస్తం పార్టీని బాగా దెబ్బ తీసింది. ఆప్, మజ్లిస్‌ కలిసి మైనారిటీ ఓట్లను కూడా చీల్చడం బీజేపీకి మరింత కలిసొచి్చంది. ఆప్‌కు కూడా ఘోర పరాజయమే మూటగట్టుకుంది. పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్‌ గాఢ్వీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు తదితరులంతా ఓటమి పాలయ్యారు. 2017లో దెబ్బ తీసిన పాటిదార్ల ఉద్యమం, జీఎస్టీపై వ్యాపారుల కన్నెర్ర వంటి సమస్యలేవీ లేకపోవడంతో ఈసారి బీజేపీ జైత్రయాత్ర నిరి్నరోధంగా కొనసాగింది. ఘనవిజయం ఖాయం కావడంతో పార్టీ కార్యకర్తలు సంబరాలకు తెర తీశారు. 

Gujarat election result


మళ్లీ భూపేంద్రే సీఎం 
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ (60) అహ్మదాబాద్‌లోని ఘాట్‌లోడియా స్థానం నుంచి 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సీఎంగా ఆయనే కొనసాగనున్నారు. డిసెంబర్‌ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.  

Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌

గెలిచిన ప్రముఖులు
☛ గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ గాట్‌లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు.
☛ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్‌నగర్‌ నార్త్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు.
☛ పటీదార్‌ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్‌ పటేల్‌ అర్బన్‌ వీరమ్‌గ్రామ్‌ స్థానంనుంచి ఆప్‌ అభ్యర్థిపై గెలిచారు. 
☛ వదగామ్‌ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్‌ మేవానీ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు.
☛ హార్దిక్‌ మాజీ సన్నిహితుడు, పటీదార్‌ నేత అల్పేశ్‌ కథిరియా వరఛా రోడ్‌ (సూరత్‌) స్థానంలో విజయఢంకా మోగించారు.
☛ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్‌ (సౌత్‌) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్‌ ఠాకూర్‌ సైతం గెలిచారు.
ఓడిన ప్రముఖులు
☛ గుజరాత్‌ ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా కటర్‌గామ్‌లో ఓడారు.
☛ఆప్‌ సీఎం అభ్యర్థి ఎసుదాన్‌ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
☛  ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు.
☛  ఇక హిమాచల్‌లో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్‌లాల్‌ ఠాకూర్, కౌల్‌సింగ్‌ ముగ్గురూ ఓటమి చవిచూశారు!

➤ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?

 

Published date : 09 Dec 2022 03:03PM

Photo Stories