Pinnacle Blooms Network: ఢిల్లీలో బుద్ధిమాంద్యం థెరపీ కేంద్రాన్ని ప్రారంభించిన సంస్థ?
పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ సంస్థ ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. 230కి పైగా దేశాల్లో నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 80 కోట్లమంది పైగా చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలే లక్ష్యంగా తమ నెట్వర్క్ ఈ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని పినాకిల్ సంస్థ చైర్మన్ డాక్టర్. కోటిరెడ్డి సరిపల్లి తెలిపారు. పినాకిల్ నెట్వర్క్ ఆటిజం బాధితుల కోసం దేశవ్యాప్తంగా నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100181181ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి 60 మంది చిన్నారులు ఒకరు బుద్ధిమాంద్యం బాధితులని, ఈ రోగం 104 ఏళ్ల కిందటే వెలుగులోకి వచ్చిందన్నారు.
చదవండి: విద్యార్థుల కోసం సర్దార్‌ధామ్ భవన్‌ను ఏ నగరంలో నిర్మించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుద్ధిమాంద్యం థెరపీ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్ సంస్థ
ఎక్కడ : సౌత్ ఎక్స్, ఢిల్లీ
ఎందుకు : బుద్ధిమాద్యంతో బాధపడుతున్న చిన్నారులు సమాజంలో ఇతరులతో సమానంగా జీవించగలిగేలా తీర్చిదిద్దేందుకు...