Siddharth: హిమాలయాలను అధిరోహించిన ఓయూ విద్యార్థి
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని సైఫాబాద్ పీజీ కాలేజీ బీఎస్సీ విద్యార్థి డొంగ్రి సిద్ధార్థ్ హిమాలయ పర్వతాలను అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
అరుణాచల్‌ప్రదేశ్ నుంచి హిమాలయాల్లోని దిరంగ్ ప్రాంతంలోని 16,460 ఫీట్ల ఎత్తులో ఉన్న గోరిచన్ పర్వతాలను సిద్ధార్థ్ అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ మేరకు ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్.పల్లాటి నరేశ్, ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కల్నల్ శరత్ ఏప్రిల్ 28న ఓ ప్రకటనలో వెల్లడించారు.
హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు నాగపూర్, షిల్లాంగ్, ఆంధ్రప్రదేశ్ ఎన్‌సీసీ విద్యార్థులు, తెలంగాణ నుంచి ఓయూ విద్యార్థి సిద్ధార్థ్ ఎంపికయ్యారు. ఎంపికైన నలుగురు విద్యార్థుల్లో పర్వతాలపై తొలిసారిగా సిద్ధార్థ్ జాతీయజెండాను ఎగురవేశారు. మార్చి 31న రాష్ట్రం నుంచి బయల్దేరిన సిద్ధార్థ్ అరుణచల్ ప్రదేశ్‌లోని నిమస్‌లో 5 రోజుల శిక్షణ పొందారు.
Published date : 29 Apr 2024 03:02PM