NCW: పాడి పరిశ్రమలో మహిళలకు సామర్థ్య శిక్షణ ప్రారంభం
పాడి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మహిళల కోసం దేశవ్యాప్త శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో చేపట్టే... ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలకు చేయూతనివ్వడం, పాల ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్ పెంచడం ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి వీలు అవుతుందని పేర్కొన్నారు. హరియాణా గ్రామీణ జీవనోపాధి మిషన్‌తో కలిసి లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ, యానిమల్ సైన్సెస్(LUVAS)లో... సెప్టెంబర్ 27న మహిళా స్వయం సహాయక బృందాల కోసం ‘వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్’ అంశంపై ఈ ప్రాజెక్ట్‌లో తొలి కార్యక్రమం నిర్వహించారు. హరియాణలోని హిసార్‌లో ఎల్‌యూవీఏఎస్(LUVAS) ఉంది.
చదవండి: దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాడి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మహిళల కోసం దేశవ్యాప్త శిక్షణ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ
ఎక్కడ : లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ, యానిమల్ సైన్సెస్(LUVAS), హిసార్, హరియాణ
ఎందుకు : మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి వీలు అవుతుందని...