Global Buddhist Summit 2023: ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ సెషన్ ప్రారంభం
Sakshi Education
గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ సెషన్‌ను ఏప్రిల్ 20న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని అభిలషించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బుద్ధుడి బోధనలు చక్కని పరిష్కారాలు చూపగలవన్నారు. ‘యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత అతివాదం, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో అంతర్జాతీయ సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటికి గౌతముని సద్గుణ బోధనలు పరిష్కార మార్గాలు చూపుతాయి’ అని అన్నారు.
పర్యావరణ మార్పు సమస్యకు సంపన్న దేశాలే కారణమంటూ విమర్శించారు. బుద్ధుడు చూపిన మార్గం భవిష్యత్, సుస్థిర పథం. గతంలోనే ఆయన చూపిన మార్గంలో వెళ్లిఉంటే ఇప్పుడీ ప్రపంచానికి ప్రకృతి విపత్తులు దాపురించేవే కాదు. సంకుచిత భావన నుంచి విస్తృత సమ్మిళిత ప్రపంచ భావన దిశగా మళ్లడం అత్యావశ్యకం. సదస్సుకు 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు తదితరులు వచ్చారు.
Quantum Mission: రూ.6,003 కోట్లతో కేంద్రం క్వాంటమ్ మిషన్..
Published date : 21 Apr 2023 01:35PM