Skip to main content

Bharat Rice: మార్కెట్‌లోకి ‘భారత్‌ రైస్‌’.. రూ.29కే కిలో బియ్యం..

కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టింది.
Modi Government to Launch Bharat Rice bb  Bharat Rice Bag with Price Tag

ఫిబ్రవరి 6వ తేదీ భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. ఇప్ప‌టి నుంచి ఎన్‌ఏఎఫ్‌ఈడీ, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్‌ రైస్‌ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లి పాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్‌ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్‌లో కిలో రూ.35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి.

Ayodhya: ‘రామాలయం’ సమీపాన ఆ రాష్ట్ర భవనం..!

Published date : 07 Feb 2024 09:43AM

Photo Stories