Lok Sabha: సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లు ఉద్దేశం?
సంతాన సాఫల్య కేంద్రాలు; మహిళల అండాలు, పురుషుల వీర్యాన్ని భద్రపరిచే కేంద్రాల నియంత్రణ, పర్యవేక్షణతో పాటు సంబంధిత సాంకేతికతల దుర్వినియోగాన్ని అడ్డుకొనే లక్ష్యంతో రూపొందించిన ‘‘సంతాన సాఫల్య సహాయక సాంకేతికత (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ–ఏఆర్‌టీ) నియంత్రణ బిల్లు–2020’’కు లోక్‌సభ డిసెంబర్ 1న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. దేశంలోని సంతాన సాఫల్య కేంద్రాలు, ఈ రంగంలో సేవలందించే వైద్య నిపుణుల పేర్ల నమోదు కోసం జాతీయ పట్టిక(నేషనల్ రిజిస్ట్రీ), నమోదు యంత్రాంగం(రిజిస్ట్రేషన్ అథారిటీ) ఏర్పాటు చేయనున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలనూ నియంత్రించనున్నారు.
చదవండి: చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు ఏయే ఆలయాలను సందర్శిస్తారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సంతాన సాఫల్య సహాయక సాంకేతికత (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ–ఏఆర్‌టీ) నియంత్రణ బిల్లు–2020కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ, పర్యవేక్షణతో పాటు సంబంధిత సాంకేతికతల దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్