Skip to main content

Uttarakhand: చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు ఏయే ఆలయాలను సందర్శిస్తారు?

Kedarnath Temple

ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం నుంచి విధులు నిర్వర్తిస్తున్న చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును రద్దుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి నవంబర్‌ 30న ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ హయాంలో 2019లో ఈ బోర్డును ఏర్పాటుచేశారు. ప్రఖ్యాత ఆలయాలు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిసహా 51 ప్రముఖ ఆలయాల పాలనా వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటోంది.

ధ్యాని కమిటీ సిఫార్సుల మేరకు..

తమ సంప్రదాయ హక్కులను చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు ఉల్లంఘిస్తోందని, పూజారులు మొదట్నుంచీ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాజాగా మనోహర్‌ కంత్‌ ధ్యాని(రాజకీయ నాయకుడు) నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను సీఎం పుష్కర్‌ ధామికి నవంబర్‌ 28న అందజేసింది. కమిటీ సిఫార్సుల మేరకు బోర్డును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

నాలుగు ఆలయాల సందర్శన..

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్‌–నవంబర్‌ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్‌– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఈ నాలుగు ఆలయాలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. 
చ‌ద‌వండి: సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును రద్దు చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్‌ 30
ఎవరు    : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి
ఎందుకు : పూజారుల సంప్రదాయ హక్కులను చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు ఉల్లంఘిస్తోందని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 Dec 2021 01:48PM

Photo Stories