Skip to main content

List Of Words Banned In Parliament: ఇక ఈ పదాలపైనా పార్లమెంట్‌లో నిషేధం

List Of Words Banned In Parliament
List Of Words Banned In Parliament

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం– కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్‌ స్ప్రెడర్‌’, ‘స్నూప్‌ గేట్‌’ వంటి పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతోపాటు అతి సాధారణంగా ఉపయోగించే ‘సిగ్గు చేటు’, ‘వేధించడం’, ‘మోసగించడం’, ‘అవినీతిపరుడు’, ‘డ్రామా’, ‘హిపోక్రసీ’, ‘నియంత’ అనే పదాలను కూడా ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. తాజా జాబితా ప్రకారం–‘శకుని’,‘తానాషా’,‘వినాశ పురుష్‌’, ‘ఖలిస్థానీ’, ‘ద్రోహ చరిత్ర’, ‘చంచా’, ‘చంచాగిరి’, ‘పిరికివాడు’, ‘క్రిమినల్‌’, ‘మొసలి కన్నీళ్లు’, ‘గాడిద’, ‘అసమర్థుడు’, ‘గూండాలు’, ‘అహంకారి’, ‘చీకటి రోజులు’, ‘దాదాగిరి’, ‘లైంగిక వేధింపులు’, ‘విశ్వాసఘాతకుడు’ వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదు.

చ‌ద‌వండి: Weekly Current Affairs (National) Bitbank: దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Jul 2022 04:58PM

Photo Stories