Skip to main content

Kuno loses another cheetah: మ‌రో చీతా మృతి... వ‌రుస‌గా చీతాలో మృతితో ప్రాజెక్టుపై నీలినీడ‌లు..!

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు. బుధవారం ఉదయం మరో చీతా చనిపోయింది. తాజాగా మృతి చెందింది ఆడ చీతా అని, దాని పేరు ధాత్రి అని పార్క్‌ అధికారులు వెల్లడించారు. గ‌త ఐదు నెల‌ల్లో ఇది తొమ్మిదో ఘ‌ట‌న‌.
Kuno loses another cheetah
మ‌రో చీతా మృతి... వ‌రుస‌గా చీతాలో మృతితో ప్రాజెక్టుపై నీలినీడ‌లు..!

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: దీంతో మరణించిన చీతాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు పెద్ద చీతాలు మ‌ర‌ణించ‌గా... నమీబియా నుంచి తీసుకువ‌చ్చిన జ్వాల అనే చీతాకు జన్మించిన మూడు కూనలూ కూడా మ‌ర‌ణించాయి. దీంతో మొత్తం ఎనిమిది చీతాలు మ‌ర‌ణించిన‌ట్లైంది. 

చ‌ద‌వండి: చీతా.. చిరుత.. జాగ్వార్‌.. ఈ మూడింటిలో ఏది గ్రేట్‌ అంటే..?

2022 సెప్టెంబర్‌లో చీతాల పునర్‌ఆగమన కార్యక్రమాన్ని భార‌త్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఒక‌టిత‌ర్వాత మ‌రొకటి మ‌ర‌ణిస్తూ ఉండ‌డంతో ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చీతాలు మరణించడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదనతో పాటు ఆందోళ‌న వ్యక్తంచేస్తున్నారు.

cheetah

చ‌ద‌వండి: మ‌ళ్లీ భార‌త్‌కి వ‌స్తున్న చీతాలు... ఈ సారి ఎన్నంటే...!

కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. వీటిలో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ఆడ చీతాలు, ఒక మ‌గ చీతా మ‌ర‌ణించింది. అలాగే మూడు కూన‌లు చ‌నిపోయాయి. దక్ష, సాశా, జ్వాల, ధాత్రి అనే ఆడ చీతాలు మ‌ర‌ణించాయి. జ్వాల ఈ ఏడాది మార్చిలో నాలుగు కూన‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా అందులో మూడు పిల్ల‌లు చ‌నిపోయాయి. 

Published date : 02 Aug 2023 03:25PM

Photo Stories