Skip to main content

INS అధ్యక్షునిగా కేఆర్‌పీ రెడ్డి.. తెలుగు పత్రికల నుంచి తొలిసారి దక్కిన అవకాశం

ప్రతిష్టాత్మక ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షునిగా సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్‌ కె.రాజాప్రసాద్‌రెడ్డి ఎన్నికయ్యారు.
KRP Reddy elected INS president
KRP Reddy elected INS president

ఎకనామిక్‌ టైమ్స్‌కు చెందిన మోహిత్‌ జైన్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సొసైటీ 83వ వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 23న జరిగింది. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా రాకేశ్‌ శర్మ (ఆజ్‌ సమాజ్‌), వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంవీ శ్రేయమ్స్‌ కుమార్‌ (మాతృభూమి ఆరోగ్య మాసిక), గౌరవ కోశాధికారిగా తన్మయ్‌ మహేశ్వరి (అమర్‌ ఉజాలా), సెక్రటరీ జనరల్‌గా మేరీ పాల్‌ను ఎన్నుకున్నారు. 41 మందిని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. మోహిత్‌ జైన్‌ (ఎకనామిక్‌ టైమ్స్‌), ఐ.వెంకట్‌ (అన్నదాత), గిరీశ్‌అగర్వాల్‌ (దైనిక్‌ భాస్కర్‌), వివేక్‌ గోయంకా (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), జయంత్‌ మమెన్‌ మాథ్యూ (మలయాళమనోరమ) తదితరులు వీరిలో ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐఎన్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఓ తెలుగు పత్రికకు దక్కడం ఇదే తొలిసారి. 

Also read: AP ఉప సభాపతిగా ‘కోలగట్ల’ ఏకగ్రీవం

గతంలో ఇంగ్లిష్‌ డైలీ డక్కన్‌ క్రానికల్‌కు చెందిన వెంకట్రామిరెడ్డి అధ్యక్షునిగా చేశారు. 1939లో ఏర్పాటైన ఐఎన్‌ఎస్‌ మన దేశంలో దినపత్రికలు, మేగజైన్లు్ల, పీరియాడికల్స్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో అత్యున్నత సంఘం.

Also read: Ants: మేం ఎంత మంది ఉన్నామో చూశారా..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 24 Sep 2022 05:54PM

Photo Stories