Karnataka Election 2023 Exit Poll Results : కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే..?
ఇక, అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అన్ని ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 113. అయితే, ఏ పార్టీ 113 స్థానాల్లో పూర్తి మెజార్టీ రాలేదని అన్ని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి.
పీపుల్స్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు..
కాంగ్రెస్ | 107-119 |
బీజేపీ | 78-90 |
జేడీఎస్ | 23-29 |
ఇతరులు | 1-3 |
రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు :
కాంగ్రెస్ | 94-108 |
బీజేపీ | 85-100 |
జేడీఎస్ | 24-32 |
జన్‌కీ బాత్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు :
కాంగ్రెస్ | 91-106 |
బీజేపీ | 94-117 |
జేడీఎస్ | 14-24 |
మ్యాటరేజ్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు :
కాంగ్రెస్ | 103-118 |
బీజేపీ | 79-99 |
జేడీఎస్ | 23-25 |
పోల్ స్ట్రాట్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు :
కాంగ్రెస్ | 99-109 |
బీజేపీ | 88-98 |
జేడీఎస్ | 4-26 |
జీ న్యూస్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు :
కాంగ్రెస్ | 103-108 |
బీజేపీ | 79-94 |
జేడీఎస్ | 25-33 |
పీపుల్స్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు :
కాంగ్రెస్ | 107-119 |
బీజేపీ | 78-90 |
జేడీఎస్ | 23-29 |
ఇతరులు | 1-3 |
గత సంప్రదాయం ప్రకారమే ఈసారి ఎన్నికలతో ప్రభుత్వాన్ని మారుస్తారా? లేదంటే 38 ఏళ్ల సంప్రదాయాన్ని బద్దలు కొట్టి వరుసగా రెండోసారి అదే ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తారా?.. అనేది మే 13వ తేదీన కౌంటింగ్‌తో తేలనుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. 2018లో నమోదు అయిన పోలింగ్ శాతం 72.13. ఇక ఈసారి ఎంత నమోదు అయ్యిందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
మళ్లీ హంగ్ వస్తే..?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ హంగ్ తప్పకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తోంది. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో ఎప్పటి మాదిరిగానే దేవేగౌడ పార్టీ కింగ్ మేకర్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.