Skip to main content

Judicial Conference: సీఎంలు, చీఫ్‌ జస్టిస్‌ల సదస్సును ఎక్కడ నిర్వహించారు?

Judicial Conference

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సును ఏప్రిల్‌ 30న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించారు. సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమన్నారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ‘‘2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించింది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

GK Awards Quiz: 2022 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికైనది?

సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రసంగిస్తూ.. దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌ బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడం, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా సదస్సులో చర్చించారు.Healthcare Services: వైద్య సేవలు ఏ చట్టం పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సు నిర్వహణ
ఎప్పుడు : మే 1  
ఎవరు    : కేంద్ర న్యాయ శాఖ
ఎక్కడ    : విజ్ఞాన్‌ భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 May 2022 05:43PM

Photo Stories