PSLV-C54 : పీఎస్‌ఎల్‌వీ-సీ54 రిహార్సల్ సక్సెస్
25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ ప్రయోగానికి సంబంధించి నవంబర్ 24న షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్‌ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు
ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది.
కౌంట్‌డౌన్ ప్రారంభం అనంతరం రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్ వెర్షన్‌లో 24వ ప్రయోగం కావడం విశేషం.