Skip to main content

Indian Woman Cadet: ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్

ఇరాన్‌ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్‌సీ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్‌ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
Indian woman cadet onboard MSC Aries seized by Iran returns home  Female cadet Ann Tessa Joseph returns home safely

కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్‌ టెస్సా జోసెఫ్‌ను ఇరాన్‌ ప్రభుత్వం విడుదల చేయడంతో ఏప్రిల్ 18వ తేదీ విమానంలో కొచ్చిన్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది.

వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో ఫోన్‌లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ నాలుగు రోజుల క్రితం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ అబొల్లాహియన్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్‌ ప్రత్యేక బలగాలు ఏప్రిల్ 13వ తేదీ హొర్ముజ్‌ జలసంధిలో ఉన్న ఎంఎస్‌సీ ఏరీస్‌ నౌకను స్వాధీనం చేసుకుంది.

Hybrid Pitch: భారత్‌లో తొలి 'హైబ్రిడ్ పిచ్‌'.. ఎక్క‌డంటే..

Published date : 19 Apr 2024 05:35PM

Photo Stories